కరోనా పేషెంట్లకు కేసీఆర్ భరోసా

TELANGANA CHIEF MINISTER KCR VISITED GANDHI HOSPITAL TODAY. HE WENT TO COVID EMERGENCY WARD AND TOLD THAT GOVT WILL SUPPORT AT ANY POINT OF TIME AND NO NEED TO WORRY ABOUT COVID.

కరోనా చికిత్సలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ప్రగతిభవన్‌ నుంచి నేరుగా సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడ కరోనా చికిత్స ఏర్పాట్లు, సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. ఆక్సిజన్‌, ఔషధాల లభ్యత గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

గాంధీ దవాఖానలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్లను సీఎం కేసీఆర్ పరామర్శిస్తున్నారు. గాంధీలో సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్ లను, వైద్య సిబ్బందిని సీఎం కేసిఆర్ అభినందించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్లను పరామర్శిస్తూ, వారికి ధైర్యాన్నిస్తున్నారు. ఔట్ పేషెంట్ వార్డులో కరోనా చికిత్స పొందుతున్న పేషంట్లకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకుంటున్న సీఎం కెసిఆర్.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article