కేసీఆర్ ఏపీలో సభ పెడితే బాబుకు ఎర్రగడ్డ ఆస్పత్రి ఖాయం

KCR will conduct meeting , Chandra babu ill go To Erragadda Hospital  టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు మీద రోజుకో రకంగా విమర్శలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆయనతోపాటు జీవన్ రెడ్డి కూడా తోడయ్యారు.మొన్న కేటీఆర్ జగన్ ని కలిస్తే ఏపీ టీడీపీ నాయకులు భూకంపం వచ్చినట్లు బెంబేలెత్తిపోయి మాట్లాడుతున్నారు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడితే చంద్రబాబు నాయుడు భయంతో గిజగిజ లాడుతున్నాడని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఇతర రాష్ట్రాల నేతలను కలిశారు…బీజేపీ, కాంగ్రెస్ యేతర పక్షాలు ఏకమయ్యే విధంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పిన జీవన్ రెడ్డి కెసిఆర్ దేశానికి ప్రధాని కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోర్లా పడిన చంద్రబాబు మొన్న జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా చావుదెబ్బ తిన్నాడు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఆదరించకున్నా మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ కు గబ్బిలం లాగా పట్టుకుంది నువ్వు కాదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర పథకాలు కాపీ కొట్టడం చంద్రబాబేనని మీలాగా డబ్బింగ్ సినిమాలు మేము చేయము.. ఒకవేళ మేమే సినిమా చేస్తే అదంతా జై తెలంగాణ జై భారత్ లాగా ఉంటుంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో సభ పెడితే మీరు మతి భ్రమించి ఎర్రగడ్డ లో చేరడం ఖాయం అంటూ ఎద్దేవా చేశారు. దగ్గరైన టిడిపి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చారు. తెలంగాణలో అందిస్తున్న పథకాలను వేరే రాష్ట్రాల వాళ్లు సైతం అమలు చేస్తున్నారంటూ గుర్తు చేశారు. ఇలా పెడితే ఎలా మాట్లాడితే సహించేది లేదంటూ మేము ఏపీలో కాలు పెడితే టిడిపి పతనం ఖాయమంటూ జీవన్ రెడ్డి టిడిపి నాయకుల పై, చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article