బాబుకు షాక్ .. కేఈ ప్రభాకర్ టీడీపీకి గుడ్ బై..

119
KE PRABHAKAR QUIT TDP
KE PRABHAKAR QUIT TDP

KE PRABHAKAR QUIT TDP

స్థానిక సంస్థల ఎన్నికలు  టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకపక్క ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు వరుసగా వలసల బాట పట్టటం టీడీపీకి అసలు డైజెస్ట్ కావటం లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు  పదుల సంఖ్యలో కీలక నేతలు పార్టీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతుంటే  టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే వరుసగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సైకిల్ దిగి వైసీపీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే.

మొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌, రహమాన్‌, కదిరి బాబూరావు, రామసుబ్బారెడ్డి, అంతేకాదు పులివెందులలో జగన్‌పై పోటీ చేసిన సతీష్‌రెడ్డి కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. నిన్నటికి నిన్న కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్  వైసీపీ కండువా కప్పుకున్నారు.  తాజాగా మరో సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యానని నిజమైన కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని కొందరు బీజేపీలో ఉంటూ టీడీపీలో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.

ఏ పార్టీలో చేరుతానన్నది త్వరలోనే చెబుతానని తాను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై వైసీపీ సహకారం కూడా ఉందని అన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.మరోవైపు తమ్ముడు కేఈ ప్రభాకర్ చేరికపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. డోన్‌లో టీడీపీ నుంచి ఎవరినీ పోటీకి పెట్టడం లేదని ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే పోటీ నుంచి విరమించుకున్నామని ప్రకటించారు. మొత్తానికి టీడీపీకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయటం పెద్ద ప్రస్థానంగా మారింది.  నేతల వలసలతో టీడీపీ కుదేలవుతుంది.

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here