కోట్ల ఇన్.. కేఈ ఔట్?

KE THINKING TO LEAVE TDP

  • టీడీపీలోకి కోట్ల వస్తే పార్టీ వీడే యోచనలో కృష్ణమూర్తి

రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కోసారి భలేగా మారుతుంటాయి. నేతల పార్టీ మార్పులు అధిష్టానానికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. అప్పటివరకు ప్రత్యర్థులుగా వ్యవహరించినవారు ఒకే పార్టీలో ఇమడక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయంలో కొంతమంది సర్దుకుపోతే, మరికొంతమంది మాత్రం సొంత పార్టీకి గుడ్ బై చెప్పడానికీ వెనకాడరు. ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వ్యవహారం టీడీపీలో ప్రకంపలను సృష్టించడం ఖాయమంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరుపై కోట్ల గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కోట్లను పార్టీలో చేర్చుకునే విషయంలో చంద్రబాబు స్వయంగా చర్చలు జరిపి, ఆయన డిమాండ్లకు దాదాపు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే, కోట్లను టీడీపీలో చేర్చుకుంటే కేఈ కృష్ణమూర్తి టీడీపీ వీడే అవకాశం ఉందని అంటున్నారు. చాలా కాలంగా కోట్ల, కేఈ కుటంబాల మధ్య వైరం ఉంది. పైగా డోన్ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని కోట్ల కోరినట్టు తెలిసింది. ఇందుకు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా.. డోన్ లేదా మరో సీటు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. చాలా కాలంగా కేఈ కుటుంబం డోన్ నుంచి పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో డోన్ సీటు కోట్ల కుటుంబానికి ఇస్తే, కేఈ పార్టీ వీడటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article