మంథనిని పీవీ జిల్లాగా చేయాలి

51

పీవీ జిల్లా ఏర్పాటు చేస్తే మంథని కేంద్రంగా చెయ్యాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పీవీ ని రాజకీయాలకు పరిచయం చేసింది మంథనియే కాబట్టి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలం ఇటు కరీంనగర్ కు అటు వరంగల్ కు కూత వేటు దూరంలో ఉంటుంది. అదే మంథని నియోజకవర్గంలోని చాలా మండలాలు అటు పెద్దపల్లికి లేదా ఇటు భూపాలపల్లి కి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

  • పీవీ హుజూరాబాద్ నియోజకవర్గంలో పుట్టినా రాజకీయ జీవితం అంతా ముడిపడి ఉన్నది మంథని తోనే. మంథని ప్రాంతం కూడా రాజకీయ పరంగా అంత ప్రాముఖ్యం లేదు. అందుకే, మంథని కేంద్రంగా జిల్లా చెయ్యాలి అనే డిమాండ్ చాలా రోజుల్నుంచి ఉంది. పైగా, ఇది చాలా పురాతనమైన డిమాండ్. జిల్లాల పునర్విభజన సమయంలో కూడా పీవీ పేరిట మంథని జిల్లా చెయ్యాలని కొందరు రిలే నిరాహార దీక్షలు చేసిన సందర్భాలున్నాయి. మంథని నియోజకవర్గ ప్రజలకు అసలు పెద్దపల్లి ప్రాంతంతో సంబంధమే లేదు. దవాఖాన కోసం గోదావరిఖని లేదా హైదరాబాద్ వెళ్తారు కానీ పెద్దపల్లి వెళ్లేవారు తక్కువే. పెద్దపల్లి ప్రజలూ హాస్పిటల్ కోసం అటు రామగుండం, కరీంనగర్ లేదా హైదరాబాద్ వెళతారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోయినా పెద్దపల్లి జిల్లాను చేశారని చాలామంది నేటికీ అంటుంటారు. కనీసం ఇప్పుడైనా మంథని ప్రాంత దశబ్ధాల కల అయిన పీవీ పేరుతో జిల్లా అవకాశాన్ని, అభివృద్ధిని అడ్డుకోవడం అన్యాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పీవీ రాజకీయ జీవితం అంతా మంథని గోదావరి పరివాహక ప్రాంతం తోనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ తర్వాత కోర్టు, డిగ్రీ కాలేజ్ ఇలా ఎన్నో ప్రభుత్వ బంగళాలు మంథని సొంతం. కాబట్టి, పీవీ పేరుతో జిల్లా అంటే మంథని అవ్వాలనేది అధిక శాతం మంది కోరిక. మరి, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here