దసరా ప్రమోషన్ల సందర్భంగా కీర్తిసురేష్‌లో కొత్త కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ఆమె తన హాట్‌హాట్ డ్రెస్సింగ్‌తోనూ..ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. సోషల్ మీడియాకే వేడి పుట్టిస్తోంది.
కీర్తి అంటే ఇప్పటిదాకా పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్‌తోనే చూస్తుంటాం.కానీ కొన్నాళ్లుగా తనలో సెక్స్ అప్పీల్ కూడా ఉందని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తోంది. తనలోని గ్లామరస్ కోణాన్ని బయట పెడుతూ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ప్రయత్నం `సర్కారు వారి పాట` నుంచే షురూ అయ్యిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో ఆమె కనిపించిన విధానం మాస్‌కి నచ్చింది. అయితే దసరాలో మళ్లీ ఆమె కొంచెం డీ గ్లామరస్ పాత్రలో కనిపిస్తోంది. సినిమాలో ఎలా కనిపిస్తేనేం… బయట ప్రమోషన్లలో మాత్రం అదరగొడుతోంది.
సినిమాలో లుక్‌కీ… ప్రమోషన్లలో ఆమె కనిపించే విధానానికీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కీర్తి కూడా పనిగట్టుకునే ఇలా ప్రమోషన్లలో పాలు పంచుకొంటోంది. హాట్ హాట్ ఫొటోషూట్లు కూడా ఓ వ్యూహంతోనే చేస్తోందని సమాచారం. సినిమా చూసి అదే రకమైన పాత్రలకి తనని పరిమితం చేయకుండా… తనలోని గ్లామర్ కోణాన్ని కూడా చూడాలని, ఆ ప్రతిభని కూడా వాడుకోవాలని చెప్పే ప్రయత్నమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దసరా సినిమాలో ఈమె వెన్నెల పాత్రలో సందడి చేస్తోంది. అన్నట్టు రీసెంట్‌గా జస్ట్ ఫర్ ఫన్ అంటూ ఈ ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంది కీర్తి. నిజంగా కిక్కెక్కించడం లేదూ!