రూమ‌ర్లు లైట్ అంటున్న కీర్తి

keerthy suresh denies her marriage

హీరోయిన్  కీర్తిసురేష్ ప్రేమ‌, పెళ్లి క‌బుర్ల గురించి పుకార్లు కొత్తేమీ కాదు.ప్ర‌తి ఆర్నెళ్ల‌కోమారు ఆమె ప్రేమ‌కి సంబంధించి ఓ కొత్త పేరుతో లింక్ పెడుతూ ప్ర‌చారం సాగుతుంటుంది.ఇదివ‌ర‌కు ఆమె ఓ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో డేటింగ్‌లో ఉంద‌ని,ఇద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ కూడా పూర్త‌యింద‌ని ప్ర‌చారం సాగింది.ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఓ ఫొటో కూడా ఆ ప్ర‌చారానికి మ‌రింత‌గా ఆజ్యం పోసింది.అంత‌కుముందు ఓ త‌మిళ హీరోతోనూ ఆమె ప్రేమ‌లో ఉన్న‌ట్టు పుకార్లొచ్చాయి.తాజాగా మ‌రోసారి ఆమె పెళ్లి ప్ర‌స్తావ‌న తెర‌పైకొచ్చింది.ఓస్టార్ హీరోతో కీర్తి ప్రేమ‌లో ఉంద‌ని,త్వ‌ర‌లోనే ఆమె పెళ్లి క‌బురు వినిపించ‌నుంద‌నే గుస గుస‌లు షురూ అయ్యాయి.
ఇప్ప‌టికే నాకు మూడుసార్లు పెళ్లి చేశారంటూ ఇదివ‌ర‌కు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చిన ఆమె ఈసారి మాత్రం చాలా లైట్‌గా తీసుకుంది.పుకార్ల‌కి అస‌లేమాత్రం రెస్పాండ్ కాకుండా,త‌న సినిమాల‌తో తాను బిజీ బిజీగా గ‌డుపుతోంది.ప్ర‌స్తుతం కీర్తి తెలుగులో భోళా శంక‌ర్ సినిమాలో న‌టిస్తోంది.నానితో క‌లిసి ఇటీవ‌ల ద‌స‌రాలోనూ న‌టించింది.కీర్తి  ప్రేమ క‌బుర్ల సంగ‌తిని ప‌క్క‌న‌పెడితే ఆమె ఫ్రెండ్‌షిప్‌కి మాత్రం చాలా ప్రాధాన్యం ఇస్తుంటుంది.టాలీవుడ్‌లో ఆమెకి క్లోజ్ స‌ర్కిల్ ఒక‌టి ఉంది. అందులో నాని,నితిన్ మొద‌లుకొని ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి వ‌ర‌కు ప‌లువురితో కీర్తి స‌న్నిహితంగా మెలుగుతూ ఉంటుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article