మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య

52
Keesara Mro sucide
Keesara Mro sucide

Keesara Mro sucide

ఏసీబీకి చిక్కిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించాయి. దాంతో అధికారులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆయనతో పాటు వీఆర్ఏ‌ సాయి రాజ్‌‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల దాడుల్లో 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేశాడని తేలింది. దానికి సంబంధించిన రూ. కోటీ పది లక్షల డబ్బును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం అధికారులు చంచల్ గూడకు తరలించగా, ఆయన ఆత్యహత్యకు పాల్పడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here