24 గంటలూ షాపులు తెరిచే ఉంటాయ్

KEJRIWAL GOOD DECISION

కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని అతలాకుతులం చేస్తోన్న కరోనా వైరస్ గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ లు ఇద్దరూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన వేళ.. నిత్యవసర వస్తువుల కోసం ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు వీలుగా.. ఢిల్లీ వ్యాప్తంగా 24 గంటలూ నిత్యవసర వస్తువుల షాపులు తెరిచి ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని వారు చెప్పారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని.. ఈ నేపథ్యంలో మరిన్ని చర్యలు అవసరమన్న ఆయన.. దేశ రాజధానిలో గడిచిన 24 గంటల్లో ఒకే ఒక్క కేసు నమోదైందని చెప్పారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 36కుచేరుకున్నట్లైంది. ఇప్పటివరకూ ఢిల్లీలో నమోదైన కేసుల్లో అత్యధికం విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి కారణంగానే కావటం గమనార్హం. ఇప్పటికి 36 కేసులు నమోదు కాగా.. అందులో 26 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారే కాగా.. మిగిలిన వారు మాత్రం ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పరిస్థితి అదుపులో ఉందన్న మాట వారి ప్రెస్ మీట్ స్పష్టం చేసింది. మరి.. 24 గంటల పాటు నిత్యవసర దుకాణాలు తెరిచి ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది  తెలియాల్సి ఉంది .

tags: #corona virus, #India corona effect, #corona pandemic in India, #Delhi cm kejriwal, lieutenant governor anil baijal, essential commodities, 24 hours ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *