కేజ్రివాల్ @ఫిబ్రవరి 14th

Kejriwal’s connection with February 14

ఢిల్లీ ఫలితాల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు కనీస పోటీ ఇవ్వలేకపోయాయి. ముచ్చటగా మూడో సారి ఢిల్లీ ప్రజలు ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ను ముఖ్యమంత్రిని చేశారు. ఈ విజయంపై కేజ్రివాల్ సంతోషం వ్యక్తం చేస్తూ..ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్‌ యూ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎగ్జిట్ పోల్ చెప్పిన ప్రకారమే ఆప్ విజయం సాధించడం గమనార్హం. మరోవైపు ఓ ఆసక్తికర విషయం కూడా చోటు చేసుకుంది. అదేమంటే కేజ్రివాల్ కి ఫిబ్రవరి 14వ తేదీకి అనుబంధం ఉంది.  కేజ్రీవాల్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీనే. మరో షాకింగ్ ఏంటంటే అరవింద్ కేజ్రివాల్ ది ప్రేమ వివాహం కావడం. ఇక ఫిబ్రవరి 14th అంటే ప్రేమికుల దినోత్సవం అని తెలిసిందే.

Kejriwal’s connection with February 14,Delhi Election Results 2020,Arvind Kejriwal Love Marriage,Delhi CM Arvind Kejriwal

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article