జగన్ కు సూటి ప్రశ్న వేసిన కేశినేని నానీ

114
SUSPENSE ON KESINENI NANI ISSUE
Kesineni Nani Facing problem from Employees

KESINENI NANI SHOOT JAGAN WITH SATIRES

ఏపీలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యవస్థను సమూలంగా కడిగేద్దామని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తన స్థాయిలో వ్యవస్థను శుభ్రం చేసే పనిని తాను ప్రారంభించానని… జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా అదే చేయాలని ఆయన అన్నారు. మీరిద్దరూ మనసు పెడితే అవినీతిని సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనని చెప్పారు.జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ‘వ్యవస్థను కడిగే ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారూ’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కడిగిన మాత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవని అన్నారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు ఈ వ్యవస్థను ఎలా కడుగుతారంటూ ప్రశ్నించారు.

నిన్నటికి నిన్న కేంద్ర బడ్జెట్ లో కేవలం రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారని కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ ఏం చేశారని కేశినేని నానీ పోస్ట్ ద్వారా ప్రశ్నించారు. ఇక ఇంతటి ఘనత సాధించిన మీరు , మీ ఎంపీలు చాలా గ్రేట్ అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు కేశినేని నానీ .ఇక తాజాగా వ్యవస్థను తర్వాత కడగొచ్చు ముందు మీరు మీ ఈడీ కేసులు, సీబీఐ కేసులు కడుక్కోండి అని సీఎం జగన్ కు సలహా ఇచ్చారు కేశినేని నానీ . కడిగిన ముత్యాలే వ్యవస్థను కడగగలవు అన్న నానీ పోస్ట్ కు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో మరి.

LATEST POLITICAL NEWS 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here