కేశినేని వర్సెస్ టీడీపీ .. బుద్దా రియాక్ట్ అయ్యారు

KESINENI VS TDP

టీడీపీలో కోల్డ్‌వార్‌ నడుస్తోంది. కేశినేని నానీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విటర్‌ వేదికగా పచ్చలీడర్లు రచ్చకెక్కారు. తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గ బేధాలుమరోసారి బయటపడ్డాయి. సొంత పార్టీపైనే విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరోకరు సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్‌ చేసిన విజయవాడఎంపీ కేశినేని నాని రీసెంట్‌గా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్‌ చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. ఏమీ తెలియని వారు, ఏమీ చేయలేని వారు కూడా ట్వీట్లు చేస్తుండటం దౌర్భాగ్యమని కేశినేని నాని ట్విట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడంటూ ట్వీట్‌ చేశారు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నారు. దౌర్బాగ్యం’ అంటూ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

LATEST NEWS UPDATES

ఇటు కేశినేని చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. సంక్షోభం సమయంలో పార్టీ కోసం నాయకుడి కోసం పోరాడేవాడు కావాలని సైటైర్లు చేశారు. ఇతర పార్టీ నాయలకుతో కలిసి కూల్చేవాడు ప్రమాదమన్నారు. నీలాగా అవకాశవాదులు కాదని. చచ్చే వరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడే వాడు కావాలని ట్విట్‌ చేశారు. చాలారోజుల నుంచి బుద్ధా వెంకన్నకు, కేశినేని నాని మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల టీడీపీలో షో మ్యాన్‌లు అవసరం లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌ టీడీపీలో కలకలం రేపుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *