KGF Created Sensation one more time
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన `కె.జి.ఎఫ్ చాప్టర్ 1` సరికొత్త సంచనాలను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా 200 కోట్ల రూపాయలను వసూలు చేసిన కన్నడ సినిమా రికార్డును క్రియేట్ చేసింది. అనువాద చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన నాలుగో చిత్రంగా బాలీవుడ్‌లో నిలిచింది. కాగా మరో సంచలనానికి కేంద్రబిందువైంది. పాకిస్థాన్‌లో ఈ శుక్రవారం కె.జి.ఎఫ్ హిందీ వెర్షన్‌ను విడుదల చేశారు. పాకిస్థాన్ లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో సినిమాను విడుదల చేశారు. పాక్‌లో విడుదలైన తొలి కన్నడ చిత్రంగా కె.జి.ఎఫ్ చాప్టర్ 1 రికార్డుని క్రియేట్ చేసింది