కనీసం టీజర్‌ అయినా…

193
#WeNeedKGF2Teaser
#WeNeedKGF2Teaser

KGF Fans waiting for teaser

కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో యశ్. రాఖీభాయ్ పాత్రలో మాస్, యువతను ఆకట్టుకున్నాడు. ఒక్క సినిమాతోనే ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో యశ్ కు ప్రత్యేక అభిమానగణం ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ నుంచి వరుసగా ఆప్ డేట్లు రావడం, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ విడుదల చేయడంతో వాళ్ళ, వాళ్ల అభిమానులు ఆనందపడ్డారు. మరీ హీరో యశ్ అభిమానులు ఊరుకుంటారా?

కరోనా లేకపోతే దసరా సందర్భంగా ఈ రోజు (అక్టోబర్‌ 23) కేజీఎఫ్‌2 విడుదల అయ్యేది. కనీసం టీజర్ అయినా విడుదల చేయాలంటూ #WeNeedKGF2Teaser అనే హ్యాష్‌ట్యాగ్‌ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.  ‘ఈ రోజు సినిమా రిలీజ్‌ చేస్తామన్నారు.. కుదరలేదు.. కనీసం టీజర్‌ అయినా విడుదల చేయండి’ అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి #WeNeedKGF2Teaser‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here