Sunday, October 6, 2024

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ ప్రారంభం

అడహక్ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులను మూడు నెలల ముందే ప్రారంభించేవారు. ఈ సంవత్సరం కర్రపూజ నుంచే వివాదాలు తలెత్తింది. వినాయక ఉత్సవాల నిర్వహణ విషయంలో ఖైరతాబాద్ శ్రీగణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మధ్య వివాదం నెలకొంది.

దీంతో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచనల మేరకు నూతనంగా అడహక్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే కర్రపూజ కార్యక్రమం పూర్తైంది. ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుం డటంతో, మహాగణపతి పనులు ప్రారంభించేందుకు షెడ్డు నిర్మాణ సామగ్రిని తీసుకువచ్చారు. కొబ్బరికాయ కొట్టి వెల్డింగ్ పనులు ప్రారంభించారు. దీంతో మహాగణపతి పనులకు శ్రీకారం చుట్టినట్లయ్యింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular