Khammam Mirchi Supply Foriegn Countries
తెలుగు రాష్ర్టాలోనే రెండో అతిపెద్ద మిర్చి మార్కెట్ ఖమ్మంలో ఉంది. అందుకే ఇక్కడ క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతుంది. కోవిడ్ కారణంగా కొద్ది నెలలు మిర్చి మార్కెట్ కుదేలైంది. ఇప్పుడిప్పుడే క్రయ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. మన దేశానికే పరిమితమైన ఖమ్మం మిర్చి.. ఇప్పుడే విదేశాలకు తరలుతోంది.
మలేషియా, సింగపూర్, థాయిలాండ్, చైనా, శ్రీలంక బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఘజియాబాద్, పుణె, ముంబై, కోల్కతా, తదితర ప్రాంతాలకు చెందిన విదేశీ మిర్చి ఎగుమతిదారులు ఖమ్మం మిర్చి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. చైనా, భారత్ మధ్య యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆదేశం నుంచి ఆర్డర్లు వస్తుండటం విశేషం. కరోనాతో దెబ్బతిన్న మిర్చి రైతులకు ఆనందం కలిగించే విషయం. ఒకప్పుడు గిటుబాటు లేక ధర్నాలు చేసిన రైతులు.. ఇప్పుడు మిర్చి సాగును మరింత సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.