నిర్మాత‌ల‌కు షాకిచ్చిన కియ‌రా

Kiara Advani Gave Shock for Producers
`భ‌ర‌త్ అనే నేను` సినిమాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ జ‌త‌గా న‌టించిన కియ‌రా అద్వాని త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌తో `విన‌య‌విధేయ‌రామ‌` సినిమాలో న‌టించింది. బాలీవుడ్ సినిమాల‌తో పాటు ద‌క్షిణాదిన కూడా ఈ అమ్మ‌డు మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో హీరోయిన్‌గా ఈమె ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. అలాగే.. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేయ‌బోయే సినిమా కోసం చిత్ర యూనిట్ ఈ అమ్మ‌డుని సంప్ర‌దించింద‌ట‌. అయితే కోటి పాతిక ల‌క్ష‌లు ఇస్తే న‌టిస్తాన‌ని ఖ‌రా ఖండీగా చెప్పేసింద‌ట‌. ఆమె రెమ్యున‌రేష‌న్ విన్న నిర్మాత‌లు షాక్ అయ్యి.. మరో హీరోయిన్ కోసం అన్వేష‌ణ‌లో ప‌డ్డార‌ట‌. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article