Friday, January 10, 2025

కేన్స్‌లో కియారా

రోమ్ వెళితో రోమ‌న్‌లా ఉండాల‌ని అంటారు.. కానీ కేన్స్ కి వెళ్లిన కియ‌రాకు ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు! వివ‌రాల్లోకి వెళితే.. అందాల క‌థానాయిక‌ కియారా అద్వానీ 2024 కేన్స్‌లో అరంగేట్రం చేసింది. ఈవెంట్లో కియ‌రా హంగామా ఆషామాషీగా లేదు. ఈ బ్యూటీ సంద‌డికి సంబంధించిన ఒక స్పెష‌ల్ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. అయితే నెటిజ‌నులు వెంట‌నే ఒక విష‌యాన్ని గ్ర‌హించారు. కియ‌రా త‌న భాష‌ యాసను అనూహ్యంగా మార్చేసిందని క‌నిపెట్టేయ‌డ‌మే గాక‌.. త‌న‌పై తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు. కియ‌రా ఇప్పుడే ఇలా ఎందుకు చేసింది? అంటూ చాలా మంది ప్ర‌శ్నించారు. కియారా ఫ్రెంచ్ రివేరాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. క్రేప్ ఐవరీ గౌనులో ఈ బ్యూటీ ఫస్ట్ లుక్ .. అందమైన నారింజ రంగు దుస్తులలో రెండవ లుక్ ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

కియారా అద్వానీ మూడవ ప్రదర్శనగా .. సినీరంగానికి చెందిన‌ మహిళలను గౌరవించడం కోసం రెడ్ సీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన‌ గాలా డిన్నర్‌కు హాజరయ్యింది. ఈ పార్టీలో కియారా అద్వాణీ లేస్ గ్లోవ్స్‌తో పింక్ అండ్ బ్లాక్ గౌనులో అద్భుతంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి హాజరవడం ఎంత గౌరవంగా భావిస్తోందో తెలిపిన వీడియో వైరల్‌గా మారింది. అయితే అభిమానులు కియ‌రా భాష‌ యాసను డీప్ గా ప‌రిశీలించి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. కియ‌రా మారిన‌ యాసపై అభిమానులు చాలా ఆశ్చర్యపోయారు. చాలామంది దీనిని ఫేక్ అని అభివర్ణిస్తున్నారు. కియ‌రా ఏంటి ఇలా మాట్లాడుతోంది.. కేన్స్ కి వెళ్లాకే ఇలా అయిందేమిటీ? అన్న కామెంట్లు వినిపించాయి. మొత్తానికి కియ‌రా క్లిప్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది కియారా అద్వాణీ త‌దుప‌రి వ‌రుస చిత్రాల‌తో అభిమానుల‌ను అల‌రించ‌నుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com