నేరస్తులను ఉరి తియ్యాలని డిమాండ్

killers must be hanged

ప్రియాంకా రెడ్డిపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి దహనం చేసిన నిందితులను పోలీసులు ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరు పరచనున్నారు. ఇక ఈ నేపధ్యంలో వారు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని తెలుసుకున్న ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఇటు విద్యార్థినులు , మహిళా సంఘాలు , స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ప్రియాంక హంతకులను ఉరి తీయాల్సిందే అని, ఎన్ కౌంటర్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు.

ప్రియాంక రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న విద్యార్థినులు నలుగురు నిందితుల దిష్టి బొమ్మలను చెట్టుకి ఉరితీసి తమ నిరసన వ్యక్తం చేశారు స్థానికులు పీఎస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రియాంక రెడ్డి హత్యకు కారణమైన ఆ నలుగురు మృగాళ్ళకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న వారి ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో, ఆందోళన చేస్తున్న వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
నేడు ప్రియాంక హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందుకోసం నిన్నటి వరకు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్న వీరిని నేడు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మహబూబ్ నగర్ కి తరలిస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వారిని హాజరుపరుస్తారు.

killers must be hanged,Priyanka Reddy,demanding that the accused be hanged immediately,Telangana veterinary doctor Priyanka Reddy,Shadhnagar Police Station, 4 Arrested for Gang-rape,DR.Priyanka Reddy,#RIPPriyanka Reddy #RIP Priyanka Reddy, Hyderabad, shadnagar, shadnagar hyderabad, Telangana, veterinary doctor, Shadnagar police station, fast track court, mahaboobnagar

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article