KILLI KRUPARANI TO JOIN IN YCP
- జగన్ తో భేటీ అయిన కేంద్ర మాజీ మంత్రి
- 28న అమరావతిలో పార్టీలో చేరతానని వెల్లడి
వైఎస్సార్ సీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్ సీపీలో చేరగా.. తాజాగా కాంగ్రెస్ వంతు వచ్చింది. ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 28న అమరావతిలో వైఎస్సార్ సీపీలో చేరతానని చెప్పారు. ఏలూరులో జరిగి బీసీ గర్జన సభలో బీసీలకు జగన్ ఇచ్చిన హామీలు నచ్చడంతో తాను వైఎస్సార్ సీపలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ కూడా రాసినట్టు వెల్లడించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని విమర్శించారు. హోదాపై ఏపీ ప్రజల్ని బాబు ఇంకా మభ్యపెడుతున్నారని, ఇక ఆయన్ను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు.