తెలుగురాష్ట్రాల గవర్నర్ గా కిరణ్ బేడి

KIRAN BEDI  is Governor For Telugu States

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుంటే తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను కూడా మార్చడానికి రంగం సిద్ధం చేసుకుంది కేంద్రం . రానున్న ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ మార్పు చెయ్యాలని కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు జరిగిన సమయంలో ఎవరిని బదిలీ చేయని, ఎన్ని ఆరోపణలు ఉన్నా ఎవరి పైన వేటు వేయని కేంద్ర సర్కార్ ఏపీ విషయంలో చాలా వేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏకంగా గవర్నర్ ని మార్చి ఎన్నికలకు వెళ్లబోతోంది కేంద్ర సర్కార్ . దీంతో తెలుగు రాష్ట్రాలకుకొత్త గవర్నర్ రానున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక రానున్న గవర్నర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్ తొలి మహిళా ఐపీఎస్ అధికారి అయినా కిరణ్ బేడీని తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ గా నియమిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తిరిగి గద్దెనెక్కాలని ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దానికి అనుగుణంగా ఇప్పటినుండి అడుగులు వేస్తోంది. ఇక ఏపీలో టిడిపి ను గద్దె దించాలని లక్ష్యంతో ఉన్న బిజెపి టీడీపీ టార్గెట్గా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇంతకాలం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై బదిలీ వేటు పడనుందని తెలుస్తోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే నరసింహన్ ను తొలగించి కిరణ్ బేడీని కేంద్రం రంగంలోకి దింపనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీకి రంగం సిద్ధం కాడంతో ఆయన స్థానంలో కిరణ్ బేడీని పంపాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా బిజెపి వ్యూహాత్మకంగా చేస్తున్న ప్లాన్ అని ఇప్పటికే అందరికీ అర్థమైంది.
ఇక కిరణ్ బేడి విషయానికి వస్తే అధికార పార్టీని కానీ, అధికారులను కానీ ఏదైనా చిన్న విషయంలో తేడా వచ్చినా వారికి ముచ్చమటలు పోసేలా చేస్తారు కిరణ్ బేడీ. కిరణ్ బేడీ 1949 జూన్ 9న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జన్మించారు. 1972లో ఐపీఎస్ కు ఎంపికైన ఆమె పోలీస్ శాఖలో అనేక పదవులు చేపట్టడంతోపాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపుపొందారు. అయితే బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.ఇక అనంతరం 2011లో అన్నాహజారే నేతృత్వంలో జరిగిన ఇండియన్ యాంటీ కరప్షన్ మూవ్ మెంట్ లో పాల్గొన్నారు. అనంతరం 2015 జనవరిలో భారతీయ జనతాపార్టీలో చేరిన ఆమె క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్కడ ఓటమి పాలైన ఆమెను అనంతరం 2016 మే 22న ఆమెను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పదవిలో కొనసాగుతున్నారు. పాలనా పరమైన అంశాలలో నిర్మొహమాటంగా వ్యవహరించే కిరణ్ బేడీని తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా పంపించడానికి కేంద్రంలోని బిజెపి సర్కార్ పక్కా స్కెచ్ వేసింది. బీజేపీ నుండి గవర్నర్ అయిన నేత కావటంతో బీజేపీ కి అనుకూలంగా ఎన్నికలకు సహకరిస్తారనే వ్యూహం తోనే ఆమెను తెలుగు రాష్ట్రాల ఎన్నికల ముందు బదిలీపై పంపనున్నారని తెలుస్తుంది. . ఇప్పటికే ఏపీ లోని ఎన్నికల ప్రధానాధికారిని మార్చి బీజేపీకి అనుకూలంగా ఉండే గోపాలకృష్ణ ద్వివేది ని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక ఇప్పుడు బిజెపి నుండి ప్రాతినిధ్యం వహించిన కిరణ్ బేడీని గవర్నర్ గా పంపిస్తే ఎన్నికల సమయంలో ఇబ్బందులు పెడతారని, బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తారని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే బీజేపీయేతర కూటమి ద్వారా బీజేపీ పై పోరాటం చేస్తున్న నేపధ్యంలో చంద్రబాబు ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నారు.ఇక ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ అత్యధిక ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన రికార్డు ను దక్కించుకున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి గవర్నర్ గా, విభాజిత తెలుగు రాష్ట్రాలకు తొలి గవర్నర్ గా రికార్డు సైతం ఆయనకే దక్కింది. ఇక ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తి అయినప్పటికీ కేంద్రంలోని కీలక శాఖ లో ఉన్న అధికారికి గవర్నర్ అత్యంత సన్నిహితుడు కావడం వల్ల ఆయనపై ఇప్పటివరకు బదిలీ వేటు పడలేదు. ఇంతకాలం నరసింహన్ గవర్నర్ గా రెండు తెలుగు రాష్ట్రాల కి ఉన్నప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్రం పైనే చాలా సందర్భాల్లో తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఏపీ కి సంబంధించిన కొన్ని వ్యవహారాలలో కేంద్రం ఆడమన్నట్టు ఆడారు . ఇక ఈయన స్థానంలో వస్తారని అందరూ భావిస్తున్న కిరణ్బేడీ రాకతో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయో అన్న ఆసక్తి నెలకొంది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article