ఆందోళనలపై డీజీపీని ఆరా తీసిన కేంద్ర మంత్రి

kishan reddy phone call to ap DGP

రాజధాని అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు అమరావతి గ్రామాల ప్రజలు . అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని రోడ్డెక్కి నినదిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల మోహరింపు జేఏసీ నేతల ర్యాలీలు ఆందోళనకారుల అరెస్ట్ లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  రాజధాని లో ఆందోళనలు చేస్తున్న మహిళలపై పోలీసులు దాడి చేశారని రాజధాని ప్రాంత ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారం జాతీయ మహిళా కమీషన్ దృష్టికి కేంద్రం దృష్టికి చేరడంతో మహిళలపై పోలీసుల దాడిని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు కమిటీని పంపిస్తోంది. ఇక ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై దృష్టి సారించింది. ఇక ఈ క్రమంలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. అమరావతిలో రైతులు ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

kishan reddy phone call to ap DGP,Capital amaravati, central government, ap DGP , goutham sawang , union minister, kishan reddy , capital farmers ,AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article