సీఏఏ పై వెనక్కి తగ్గం…ఆందోళనల వెనుక విదేశీ కుట్ర

KishanReddy About CAA And NRC

పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలు మొబైల్ సేవలను నిలిపి వేశారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. మరోపక్క మాయావతి కూడా తాము ఈ చట్టానికి వ్యతిరేకమని తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగించాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలకు మమతా బెనర్జీ పిలుపునిస్తున్నారు.

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం ఎవరు ఎంత ఆందోళన చేసినా సీఏఏను వెనక్కి తీసుకునేది లేదని స్పష్టంగా చెప్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా తెలియజేశారు. వారసత్వ సవరణ చట్టం వల్ల భారతీయులకు ఎలాంటి నష్టం లేదని, శ్రీలంక తమిళులకు కూడా పౌరసత్వాన్ని కల్పిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని ఈ అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై మేధావులు, ప్రజలు సరైన దిశగా ఆలోచించాలని సూచించారు. కేవలం మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే విపక్షాల ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు ఈ ఆందోళనల వెనుక విదేశీకుట్ర ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

tags : CAA, NRC, Central Minister, Kishan Reddy, Congress, BJP, Mamata Benarjee, Mayavathi

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article