పండుగ విషాదం.. ప్రాణం తీసిన పతంగి

KITE Killed a man

సంక్రాంతి పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. పతంగి ఓ వ్యక్తి ప్రాణం తీసింది. దీంతో ఓ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. చోటుచేసుకుంది. పండగ సందర్భంగా పతంగులను ఎగరవేయాలన్న ఓ యువకుడి సరదా అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ అంబర్ నగర్ ప్రాంతంలో సయ్యద్ ముక్తార్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతడి పెద్ద కొడుకు ఇమ్రాన్(27) తండ్రికి తొడుగా వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. అయితే సంక్రాంతి సందర్భంగా సరదాగా తోటి యువకులతో కలిసి పతంగులు ఎగరవేస్తుండగా ఇమ్రాన్ ప్రమాదానికి గురయ్యాడు. తాము నివాసముండే భవనం రెండో అంతస్తుపై నుండి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతన్ని కుటుంబ సభ్యులు సమీపంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇమ్రాన్ మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆస్పత్రి వద్దే బోరున విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article