KIWIS POLICE WARNING TO PUBLIC
- జాగ్రత్తగా ఉండాలంటూ కివీస్ పోలీసుల హెచ్చరిక
టీమిండియా జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండు వన్డేల్లోనూ విజయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పోలీసులు తమ ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. సరదాగా జారీచేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ప్రస్తతం మన దేశానికి పర్యటన నిమిత్తం వచ్చిన ఒక ప్రమాదకరమైన జట్టు గురించి న్యూజిలాండ్ ప్రజలకు పోలీసులు ఒక హచ్చరిక ఇవ్వాలనుకుంటున్నారు. అమాయకులైన న్యూజిలాండ్ జట్టు మీద ఆ జట్టు నేపియర్‌లోనూ, మౌంట్ మాంగనుయ్‌లనూ దాడి చేసినట్టు రిపోర్టులు వచ్చాయి. మీరు క్రికెట్ బంతి లేదా బ్యాట్ తీసుకుని బయటకు వెళ్లాలంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ న్యూజిలాండ్ లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ పోలీసులు తమ ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టుకు అనూహ్య స్పందన వ్యక్తమవుతోంది. కాగా, నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో, మౌంట్ మాంగానీలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కివీస్ జట్టును చిత్తుగా ఓడించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తేడాతో కోహ్లీసేన ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే మౌంట్ మాంగానీలో సోమవారం జరగనుంది.