ఎన్టీఆర్ కోసం మహేష్ బ్యూటీని అడుగుతున్నారా..?

31
kiyara in NTR movie
kiyara in NTR movie

kiyara in NTR movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అందరూ లాక్ డౌన్ లో చిక్కుకుంటే అతను మాత్రం ఆర్ఆర్ఆర్ లో చిక్కుకున్నాడు. రెండేళ్ల క్రితమే ఆరంభమైన ఈ ప్రాజెక్ట్ మరో యేడాది వరకూ ఆడియన్స్ ముందుకు వస్తుందన్న గ్యారెంటీ లేదు. నిజానికి అన్నీ బావుంటే ఈ సినిమా సూపర్ హిట్ లెక్కలను ఇప్పటికే టాలీవుడ్ కౌంట్ చేస్తూ ఉండేది. అంటే వీరు మొదలుపెట్టినప్పుడు 2020 జూలై 30న విడుదల అన్నారు కదా. కానీ అది సాధ్యం కాలేదు. తర్వాత సంక్రాంతికి అనుకున్నారు. కరోనా వల్ల అదీ పోయింది. ఇదే కరోనా వల్ల మళ్లీ ఎప్పుడు అని కూడా చెప్పలేని పరిస్థితి. అయితే అంతకు ముందే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో సినిమా ఖరారై ఉంది. హారిక హాసిని బ్యానర్ లో అరవింద సమేత వీరరాఘవ తర్వాత వీరి కాంబోలో రాబోతోన్న సినిమా ఇది. అరవింద సమేతలో ఎన్టీఆర్ అద్భుత నటన చూపించినా.. ఈ కాంబినేషన్ లో తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో అరవింద సక్సెస్ కాలేదనే చెప్పాలి. త్రివిక్రమ్ నుంచి అదుర్స్ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్ పెక్ట్ చేస్తే అతను మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీతో వచ్చాడు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి సెట్ అయిన ఈ కాంబో కూడా ఈ సినిమా వల్ల షూటింగ్ కు ఎప్పుడు వెళుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైతే ‘అయిననూ పోయి రావలె హస్తినకు’అనే టైటిల్ అనుకుంటున్నారు అనే రూమర్స్ ఉన్నాయి. టైటిల్ విషయం పక్కన బెడితే.. ఈ మూవీలో హీరోయిన్ విషయం మాత్రం ఇంకా తేలలేదు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు సరసన నటించిన ఓ బ్యూటీని ఎన్టీఆర్ సరసన తీసుకోవాలనే ప్రయత్నాల్లో హారిక హాసినితో పాటు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు అంటున్నారు. భరత్ అనేనేను తో తెలుగువారిని ఆకట్టుకున్న కియారా అద్వానీ ఆ తర్వాత వినయ విధేయ రామతో డిజాస్టర్ చూసింది. అయినా తన అందం, టాలెంట్ చూసి తెలుగులో పాగా వేస్తుంది అనుకున్నారు. అదే టైమ్ లో అనూహ్యంగా అమ్మడు కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో పాటు అప్పటికే ఒప్పుకున్న సినిమాలు కూడా ఉండటంతో తెలుగుకు టైమ్ ఇవ్వలేకపోయింది. కబీర్ సింగ్ హిట్ తర్వాత తను ఇప్పుడక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. దీంతో తెలుగులో తీసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. ఇంతకు ముందు మళ్లీ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో తీసుకుందాం అని ప్రయత్నించారు. తనకు డేట్స్ లేవంది. అలాగే ప్రభాస్- నాగ్ అశ్విన్ మూవీకీ ట్రై చేశారన్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరినట్టైంది. ఎన్టీఆర్.. త్రివిక్రమ్ గురించి కియారాకు తెలియకుండా ఉండదు. అందువల్ల ఈ కాంబినేషన్ కోసమైనా తను ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కు బిగ్ ఎసెట్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఆడియన్స్ కు నేరుగా తెలుస్తాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాను అక్కడ విడుదల చేస్తే కియారా ఫ్యాక్టర్ కూడా మరింత ప్లస్ అవుతుంది కాబట్టి.. తను యాక్ట్ చేస్తే ప్రాజెక్ట్ కొత్త బలంగా మారుతుంది అని చెప్పొచ్చు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here