జూబ్లీహిల్స్ లో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ఏడు డివిజన్లో నుంచి పాల్గొనే జట్లకు డివిజన్ స్థాయిలో ప్రథమంగా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారితో, రన్నరప్ గా నిలిచిన వారితో 14 జట్లను ఎంపిక చేసి నియోజకవర్గ స్థాయిలో ఫైనల్ పోటీలను నిర్వహించనున్నారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఎస్పిఆర్ హిల్స్లో తుది పోటీలకు దాదాపు నాలుగున్నర ఎకరాల క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులకు డివిజన్ల వారీగా కేటాయించిన రంగుల జెర్సీలతో ఈ పోటీలను నిర్వహించడమే కాకుండా వారికి అవసరమైన బూట్లు, టీ షర్ట్ లు, క్రీడా సామాగ్రి అందించనున్నట్లు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వెల్లడించారు. జూలై 23వ తేదీన కేటీఆర్ జన్మదినం రోజు పోటీలను నిర్వహించి విజేతలను ప్రకటిస్తామన్నారు. విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతి అందించనున్నారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహక బహుమతి అందించడంతోపాటు పేద క్రీడాకారులకు అవసరమైన శిక్షణను స్పోర్ట్స్ అథారిటీ ద్వారా అందిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article