నిరంకుశ విధానాలతో రాష్ట్రం వెనక్కి?

KodandaRam About TRS Government

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంకుశ పోకడలు బాగా పెరిగిపోయాయని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శలు గుప్పించారు. రెండవ సారి అధికారం కట్టడమే అందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ క్యాబినెట్ సరిగా పనిచేయడం లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మంత్రులంతా సీఎం కేసీఆర్ ముందు హుజూర్ అనాల్సిందే నని కోదండరాం పేర్కొన్నారు. టీజేఎస్ పూర్తి రాష్ట్రస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించిన కోదండరాం ఉన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఆయన పేర్కొన్నారు. కోదండరాం అధ్యక్షునిగా వ్యవహరించే పార్టీలో ఉపాధ్యక్షులుగా సయ్యద్‌ బదృద్దీన్, పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, రమేష్‌రెడ్డి, రాజమల్లయ్యను నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, నిరంకుశ విధానాలతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సీఎం కేసీఆర్ కుంటుపరుస్తున్నారని కోదండరాం ఆరోపించారు.

tags: telangana, tjs, kodandaram, cm kcr, trs party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *