Kohli blasts India past West Indies
టీం ఇండియా చిచ్చరపిడుగు నిన్న ఉప్పల్ లో చెలరేగిపోయాడు. వెస్టిండీస్ ఆటగాళ్లకు చుక్కలుచూపించాడు. ప్రత్యర్థులు విసిరే ఒక్కో బంతిని కసితీరా బాదాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచి టీం ఇండియాని విజయపథంలోకి తీసుకొచ్చాడు. ఇక కోహ్లీకి తోడు రాహుల్ కూడా మంచి ఆటతో రాణించాడు. ఈ మ్యాచులో కోహ్లీ 50 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో విండీస్ కు ధనాధన్ అనిపించాడు. ఇక రాహుల్ 62 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంత్ 18 పరుగులు చెయ్యగా, రోహిత్ 8 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచులో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5వికెట్లకు 207 పరుగులు చేసింది. టీం ఇండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లకు209 పరుగులతో ఘన విషయం సాధించారు.