మరో భాగస్వామ్యం నమోదై ఉంటే…

Kohli clarity on why we lost the match:team India

  • టీమిండియా ఓటమిపై కోహ్లీ

మ్యాచ్ మొదట్లోనే వడివడిగా మూడు వికెట్లు కోల్పోవడమే తమ కొంప ముంచిందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతోపాటు రోహిత్ శర్మకు సరైన అండ దొరకపోవడం వల్లే మ్యాచ్ చేజారిందని పేర్కొన్నాడు. శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ ఆటతీరును తాము సమర్థించుకోబోమని స్పష్టంచేశాడు. 300కి పైగా పరుగులు వచ్చే పిచ్ పైన ప్రత్యర్థి జట్టును 288కే పరిమితం చేయగలిగామని.. కానీ బ్యాటింగ్ లో సరిగా రాణించలేకపోవడంతో ఓటమి తప్పలేదని పేర్కొన్నాడు. ‘ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం నష్టం కలిగించింది. రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. అతడికి ధోనీ నుంచి సరైన సపోర్ట్ లభించడంతో విజయం దక్కుతుందని ఆశించాం. కానీ ధోనీ ఔట్‌ అవ్వడంతో రోహిత్‌పై ఒత్తడి మరింత పెరిగింది. రోహిత్‌కు అండగా మరో మంచి భాగస్వామ్యం నమోదైతే విజయం దక్కేది. ఆసీస్‌ మా కంటే బాగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఫలితంతో మేం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వడం లేదు. ఇలాంటి ఫలితాలు జట్టుగా ఇంకా మెరుగవ్వాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి’ అని కోహ్లీ విశ్లేషించాడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article