కోహ్లీ… ఆకలితో ఉన్న పులి

Kohli : Ready to fight In IPL

స్టార్ బ్యాట్ మన్, పదునైన బౌలర్లు, మెరుగైన ఫీల్డర్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం. జట్టులో హేమాహేమీ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఏ ఐపీఎల్ సీజన్‌లోనూ టైటిల్‌ను గెలుచుకోలేదు. కేవలం 2016లో మాత్రమై ఫైనల్‌కు చేరింది. గతేడాది మాత్రం చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మాత్రం టీం మెంబర్స్ ఎలాగైనా కప్ గెలవాలని తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. కచ్చితమైన ప్రణాళికతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. అందుకేనేమో.. ఆర్సీబీ ఆటగాళ్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక కెప్టెన్‌ కోహ్లీ అయితే మంచి జోష్‌ మీద ఉన్నాడు. ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌లో కొన్ని మంచి క్యాచ్‌లు పట్టిన కోహ్లి.. బ్యాటింగ్‌లో దుమ్ముదులిపేస్తున్నాడు. కోహ్లి మంచి ఆకలితో ఉన్న పులిలా ప్రాక్టీస్‌ చేశాడు. ప్రాక్టీస్ చేసిన వీడియోలను రీసెంట్ గా ఆర్సీబీ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.

ఈ వీడియోలో కోహ్లి మాట్లాడుతూ ‘‘మొదట్లో కొన్ని రోజులు కఠినంగా అనిపించింది. ఐదు నెలల తర్వాత ప్రాక్టీస్‌ చేసి గాడిలో పడ్డాం.. ప్రాక్టీస్‌ను ఆస్వాదిస్తున్నాం. వికెట్‌పై పేస్‌ ఎలా ఉంటుందో అనే అంశాన్ని కూడా అర్ధం చేసుకున్నాం. ప్రస్తుతం మా టీమ్‌ పూర్తిస్థాయిలో పోరుకు సన్నద్ధం కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *