KOHLI SELECTED ICC TEST TEAM CAPTAIN AGAIN
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018కి మరోసారి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 2018లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ టెస్టు జట్టులో చోటు కల్పించింది. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. భారత క్రికెట్ జట్టు యువ సంచలనం రిషబ్ పంత్ తొలి ఏడాదే అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. మరో భారత ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా కూడా ఈ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్ చటేశ్వర పుజారాకు ఇందులో చోటు లభించలేదు.
ఇంకా ఐసీసీ టెస్ట్ జట్టులో టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, హెన్రీ నికోలస్(న్యూజిలాండ్), కరుణరత్నే (శ్రీలంక), కగిసో రబడా(దక్షిణాఫ్రికా), నాథన్ లియోన్(ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), మహ్మద్ అబ్బాస్(పాకిస్తాన్)లకు స్థానం లభించింది. అయితే ఇంగ్లండ్ టెస్టు సారథి జోయ్ రూట్‌తో పాటు మరే ఇతర బ్రిటీష్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు.