కోకాపేట్‌లో జెమ్ న‌క్ష‌త్ర‌..

KOKAPET BEST PROJECT

గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ చేరువ‌లోని కోకాపేట్‌లో ల‌గ్జ‌రీ రెసిడెన్సెస్‌ను జెమ్ వివాండాస్ నిర్మిస్తోంది. జెమ్ న‌క్ష‌త్ర అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్టు డిజైన్‌ని చూస్తే.. జెమ్స్‌కు ఇట్టే న‌చ్చుతుంద‌ని చెప్పొచ్చు. నిజ జీవితంలో జెమ్స్‌గా పిల‌వ‌బ‌డే వారి కోస‌మే ఈ ప్రాజెక్టును జెమ్ వివాండాస్ రూప‌క‌ల్ప‌న చేసింది. ఆకాశాన్నంటే ట‌వ‌ర్ల‌కు ఇందులో స్థానం క‌ల్పించారు. సుమారు ప‌ద్దెనిమిది అంత‌స్తుల ఎత్తులో మూడు బేస్‌మెంట్ల‌ను క‌లుపుకుని. మొత్తం 244 ఫ్లాట్ల‌ను డిజైన్ చేశారు. ఇందులో వ‌చ్చేవ‌న్నీ రెండు, మూడు ప‌డ‌క గ‌దులే. ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం. 1290 నుంచి 1820 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. వెస్ట్ హైద‌రాబాద్‌లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా జెమ్ న‌క్ష‌త్ర రూపుదిద్దుకుంటున్నది.

జెమ్ న‌క్ష‌త్ర ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఔట‌ర్ రింగ్ రోడ్డుకి జ‌స్ట్ ప‌క్క‌నే ఉంటుంది. ఇక్క‌డ్నుంచి ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ కేవ‌లం మూడు కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంటుంది. విప్రో చౌర‌స్తా కేవ‌లం నాలుగు కిలోమీట‌ర్లే. ఇక చిన్నారుల‌కు అతి ముఖ్య‌మైన స్కూళ్లు అతి చేరువ‌గా ఉంటాయి. 300 మీట‌ర్ల‌లోపే గ్లోబ‌ల్ ఎడ్జ్ స్కూల్‌, 500 మీట‌ర్ల‌లోపు రాక్‌వెల్‌, 600 మీట‌ర్ల లోపు ఫినీక్స్ స్కూల్‌, ఓక్రిడ్జ్ ఆరు కిలోమీట‌ర్లు, డీపీఎస్ ఆరున్న‌ర కిలోమీట‌ర్ల లోపు ఉంటాయి. అత్య‌వ‌స‌రాల్లో ఆస్ప‌త్రులు కేవ‌లం నాలుగు కిలోమీట‌ర్ల లోపు ఉండ‌టంతో సులువుగా చేరుకోవ‌చ్చు.

జెమ్ న‌క్ష‌త్ర ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనొచ్చు. ఎందుకంటే, ప్రాజెక్టును మొత్తం వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇందులోని ఎంట్రెన్స్ లాబీ ఎంతో గ్రాండ్‌గా క‌నిపిస్తుంది. గ్రీన్ లివింగ్‌ వాల్ కాన్సెప్టును ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌ల్ల ఇందులో నివ‌సించేవారికి స్వ‌చ్ఛ‌మైన గాలి, వెలుతురు వంటివి ల‌భిస్తాయి. ప్రాజెక్టులో బోలెడ‌న్నీ ఆధునిక సదుపాయాల్ని పొందుప‌రిచారు. స్విమ్మింగ్ పూల్‌, జిమ్‌, మ‌ల్టీప‌ర్ప‌స్ హాల్‌, క్రెష్‌, ఎరోబిక్స్ వంటి వాటికి పెద్ద‌పీట వేశారు. హండ్రెడ్ ప‌ర్సంట్ డీజీ బ్యాక‌ప్‌, పైప్డ్ గ్యాస్‌, వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌, వైఫై జోన్ వంటివి ఏర్పాటు చేస్తారు. ఇందులో నివసించే వారి భ‌ద్ర‌త గురించి సంస్థ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంది. సీసీటీవీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్ పొందుప‌ర్చ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించారు. ప్రాజెక్టులో నివ‌సించే వారి పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా క్రెష్ ఏర్పాటు చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించారు. చిల్డ్ర‌న్ ప్లే ఏరియా, మ‌ల్టీప‌ర్ప‌స్ లాన్స్‌, వాలీబాల్‌, ష‌టిల్ కోర్టులు వంటివి ప్ర‌తిఒక్క‌ర్ని ఇట్టే ఆక‌ర్షిస్తాయి. మొత్తానికి, జెమ్స్ ల‌కు అన్నిర‌కాలుగా స‌రిపోయే విధంగా.. జెమ్ వివాండాస్‌.. జెమ్ న‌క్షత్ర‌ను తీర్చిదిద్దింది. మ‌రెందుకు ఆల‌స్యం.. వెంట‌నే, మీకు న‌చ్చిన ఫ్లాటును ఇందులో బుక్ చేసుకోండి.

HYDERABAD BEST PROPERTIES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article