కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్

Komati Reddy RajaGopal Reddy UTURN

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకున్నది ఒకటైతే అయ్యింది మాత్రం వేరేది … బీజేపీలోకి వెళ్ళకముందే బీజేపీలోకి వెళ్తే నేనే సీఎం అభ్యర్థి అని అయన చేసిన వ్యాఖ్యలే ఆయన కొంపకు చేటు చేశాయి. ఇక పార్టీ మారాలనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఆ పార్టీ అధిష్ఠాన్ని కూడా నానా ఇబ్బందులు పెట్టారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే శాపనార్థాలు పెట్టారు. అంతేనా పార్టీని వీడుతున్నట్లుగా బీజేపీలో చేరిపోతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే కోమటిరెడ్డిని స్వాగతించబోమంటూ బీజేపీ తేల్చేసిన తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలో మాట మార్చిన రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కరుణిస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశంగా మారింది. నోరు జారడం ఆ తర్వాత నాలిక మడతడిందని సర్దిచెప్పుకోవడం వరకైతే ఓకేగానీ… పార్టీకి నష్టం కలిగించేలా చాలానే చేసిన తర్వాత… వైర వర్గం పో పొమ్మని గెంటేసినంత పనిచేసిన తర్వాత యూటర్న్ తీసుకోవడం అంటే నిజంగానే కాస్తంత ఆలోచించాల్సిన విషయమే.

కోమటిరెడ్డి తీరు చూస్తే గతేడాది చివరలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం దక్కినా… తన సోదరుడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడినా… రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో పార్టీ ఘోర పరాభవానికి కారణం టీ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ఆయనను తక్షణం ఆ పదవి నుంచి దించేసి పార్టీ పగ్గాలు తనకో తన సోదరుడికో అప్పగించాలన్న కోణంలో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీపైనే ఆయన విరుచుకుపడ్డారు. అంతేకాకుండా తాను పార్టీ మారతానన్న కోణంలో ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసిన తర్వాత… ఏకంగా పార్టీ మారుతున్నట్లుగా స్పష్టమైన ప్రకటనలు గుప్పించి… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే… తానే సీఎంనని సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో పెను కలకలమే రేపారు. అయితే పార్టీలో చేరకుండానే రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన ప్రకటనలపై బీజేపీ నేతలు ఒకింత అసహనానికి గురై… కోమటిరెడ్డికి డోర్స్ క్లోజ్ చేసి పారేశారు.

Puri Jagan ISMARTSHANKAR 

ఈ క్రమంలో గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి శనివారం ఎట్టకేలకు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా యూటర్న్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డి… తాను పార్టీ మారే ప్రసక్తే లేదంటూ తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు ఎంతో అభిమానమని తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పుకొచ్చారు. పార్టీ బాగు కోసమే తాను గతంలో వ్యాఖ్యలు చేశానని ఈ విషయం గుర్తించి పార్టీ అధిష్ఠానం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ అధినేత – తెలంగాణ సీఎం కేసీఆర్ పై యుద్ధం చేయాలంటే… కుంతియా – ఉత్తమ్ లు సరిపోరని మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. దానిని తప్పుగా అర్థం చేసుకున్న నేతలు తనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీజేపీ వద్దన్నాక… తనకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే యూటర్న్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డిని హస్తం పార్టీ క్షమిస్తుందా? లేదా? అన్నది కాస్త ఆసక్తి కలిగించే అంశమే

Komati Reddy RajaGopal Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *