కేసీఆర్ తో కలిస్తే జగన్ కు చెడ్డపేరు?

komati reddy venkata reddy about jagan

తెలంగాణ రాష్ట్రంలో 13 రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ విధానాలను తప్పు పడుతున్నారు. పక్క రాష్ట్ర సీఎం జగన్ ను మెచ్చుకుంటున్నారు. జగన్ ను చూస్ అయినా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నారు.  తెలంగాణ ప్రభుత్వ తీరుపై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి  ” తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక వ్యతిరేకి, కావాలనే కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఇద్దరు ఆర్టీసీ కార్మికుల చావుకి కారణం అయ్యాడు. ఇలాంటి దుర్మగుడితో సీఎం జగన్ కలవొద్దని ఒక సలహా ఇచ్చారు. ఒకవేళ మీరు కేసీఆర్ తో కలిస్తే మీ పేరు మరియు మీ నాన్నగారి పేరు కూడా చెడిపోతాయని” ఎంపీ కోమటిరెడ్డి వాఖ్యానించారు.

అంతేకాకుండా కేసీఆర్ కంటే వయసులో చాలా చిన్నవాడైన జగన్ రాష్ట్ర పాలన పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలందరి మన్ననలను పొందుతున్నాడని, మంచి నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపితున్నాడని, కనీసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ని చూసి బుద్ది తెచ్చుకోవాలని సూచించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి. అంతేకాకుండా కేసీఆర్ తన బిడ్డని గెలిపించుకోలేని అద్వాన్న స్థితిలో ఉన్నాడని, అలాంటి వాడు ఇక రాష్ట్రాన్ని ఏం నడిపిస్తాడని, ఇలాంటి అసమర్ధుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది మన దురదృష్టం అని వాఖ్యానించారు. జగన్ కు కితాబిచ్చారు.

tags :tsrtc, tsrtc strike, rtc strike, telangana government, rtc workers , komatireddy venkata reddy , jagan, cm kcr

కల్కి అవినీతి సామ్రాజ్యం 

కార్మికులతో ప్రభుత్వం చర్చలు చేస్తుందా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *