టీపీసీసీ బాధ్యతలు అప్పగిస్తే 8 స్థానాలు గెలిపిస్తా

Komita Reddy Sensational Comments about TDP  … కోమటిరెడ్డి

తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీడీపీ తో పొత్తు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల తోనే చేస్తే బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని తెగేసి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నే టీడీపీ తో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చరిష్మా లేదని, ఇక ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమను సైతం ప్రజలు ఆదరించారని ఆయన తన భావాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓటమిపాలయ్యామని ఆరోపించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అదే తప్పుచేయోద్దని హితవు పలికారు. అలాగే ప్రస్తుతం ఉన్న పీసీసీ టీమ్ తో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఇక ప్రస్తుతమున్న టీ పిసిసి అధ్యక్షుడిని సైతం మార్చాలని గత కొంతకాలంగా సీనియర్ల నుండి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అధిష్టానానికి చాలా మంది సీనియర్లు పీసీసీ ప్రక్షాళన గురించి విన్నవించుకున్నారు. అయినప్పటికీ పీసీసీని ప్రక్షాళన చెయ్యకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లడం పార్టీకి నష్టం చేస్తుందని ఆయన అన్నారు. ఇక తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 8 పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తాను నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదన్నారు. రాజకీయాల పరంగా విబేధాలు ఉండటం సహజమేనని అయితే వ్యక్తిగత వైరం లేదని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలను బట్టి టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article