Saturday, December 28, 2024

మంత్రి ఏడ్చారు ట్రోల్స్​ పై కొండా సురేఖ కన్నీళ్లు

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై ఇష్టారీతిగా పోస్టులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన సురేఖ..ఇటీవల దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు సురేఖకు చేనేతతో తయారు చేసిన దండను అందించారు. ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని కోరారు. ఈ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీ మహిళా నేత కవితపై కూడా ఇలానే ట్రోల్ చేస్తే ఊరుకుంటారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
తెలంగాణ భవన్ వద్ద ఆందోళన..
కొండా సురేఖను ట్రోల్ చేయడంపై పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ భవన్ దగ్గర ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com