మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవినీతి పై సిబిఐ ఎంక్వయిరీ చేయాలి

రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ కార్పొరేషన్ లో జరుగుతున్న కబ్జాల పై కదిలిన అధికార యంత్రాంగం మీర్ పేట్ సంధ్య చెరువు వద్ద ఉన్న సర్వే నెంబర్ 161లో తాత్కాలికంగా నిర్మించిన గోడను అధికారులు తొలగించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై సిబిఐ ఎంక్వయిరీ వేయించమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మంద మల్లమ్మ నుండి బాలాపూర్ చౌరస్తా ప్రధాన రహదారి అనుకొని ఉన్న సందా చెరువు ఎఫ్ టి ఎల్ మంత్రి సబిత ఇంద్రారెడ్డి బంధువు ఒక ఎకరా స్థలం కబ్జా పెట్టీ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనీ టిఆర్ఎస్ నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. వాటిని అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.నేను అధికారులతో మీడియా ముఖంగా తెలియజేయడంతో అప్పటికప్పుడు వాటిని కూల్చివేసిన రెవిన్యూ అధికారులనీ అన్నారు. మంత్రి పదవి కోసం టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉద్యమకారులను అణగదొక్కి తమ అనుచరులైన కాంగ్రెస్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇస్తూ కబ్జాలను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article