టీడీపీలో చేరనున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

Kotla Surya Prkash reddy joinong in TDP- కాంగ్రెస్ కు షాక్ …

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లోనే చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లోనైనా కోలుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ ప్రయత్నం ఫలించేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్-టీడీపీ పొత్తు లతో ఏపీలో పోటీ చేస్తా అని భావిస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఎఫెక్ట్ తో ఇరు పార్టీలు పొత్తులను విరమించుకున్నారు. ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ఇక ఇక్కడ అసలు కథ మొదలైంది. కర్నూలు జిల్లా నుండి ఎంపీ గా బరిలోకి దిగాలనుకుంటున్న సూర్య ప్రకాశ్ రెడ్డి పొత్తులతో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చినా టిడిపి మద్దతుతో గెలవొచ్చని భావించారు. అయితే అతను లేవని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సమావేశంలోనే అసహనానికి గురై సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక దీంతో ఏపీలో కుదేలయిన కాంగ్రెస్‌కు కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించడం లేదు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కోట్ల కుటుంబం పార్టీ మారాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రిగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి సీఎం చంద్రబాబుతో ఆయన కుటుంబ సమేతంగా భేటి కానున్నారు. కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగి కోట్ల పార్టీని వీడకుండా బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో కోట్లకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు . కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక సీనియర్ నేత మాజీ మంత్రి పార్టీకి గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టయింది. ఇక టిడిపి నుండి కర్నూలు ఎంపీ బరిలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో బుట్టా రేణుక పరిస్థితి సందిగ్ధం లో పడింది.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article