తిరుపతమ్మను దర్శించుకున్న మంత్రికొట్టు సత్యనారాయణ

జగ్గయ్యపేట:ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఉదయ భాను, ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ సింగల్, ఇండోమెంట్ కమిషనర్ హరి జోహార్ లాల్ తదితరులు పాల్గోన్నారు. మంత్రికి వేద పండితులు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో మూర్తి స్వాగతం పలికారు. వేద పండితులు చే ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి లైన జగ దుర్గ శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి తెలంగాణ రాష్ట్ర నుంచి మన రాష్ట్రంలో. వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతూ ఆ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని కలుసుకొని పెనుగంచిప్రోలు గ్రామంలో అమ్మవారి ని దర్శించుకున్నారు. లక్షలాదిమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నానని మంత్రి అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article