క్రియేటివ్ డైరెక్టర్స్ కు క్రిష్ ఛాన్సులు

23
krish movie update
krish movie update

krish encourages talent

కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవుతాయి. కానీ విమర్శలు ఫేస్ చేస్తాయి. మరికొన్ని విమర్శకులను మెప్పిస్తాయి. కానీ కమర్షియల్ గా ఇబ్బంది పెడతాయి. ఈ రెండు అంశాల మధ్య కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అని చెప్పలేని సినిమాలతోనే తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో వైవిధ్యమైన గమనం సాగిస్తోన్న క్రిష్ నిర్మాతగానూ మారాడు. అయితే ప్రస్తుతం తన బ్యానర్ లో కొత్త కుర్రాళ్లకు ఛాన్సులు ఇస్తూ బిజీ అయిపోతున్నాడు. క్రిష్.. తొలి సినిమా గమ్యంతోనే మంచి దర్శకుడు అవుతాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వేదం, కృష్ణవందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి అంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాలన్నీ బావున్నా.. కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్స్ అని చెప్పలేని పరిస్థితి అతనికి కొంత మైనస్ గా మారింది. అటు హిందీలోనూ ఒక సినిమా చేశాడు. రెండో సినిమా వివాదాల నడుమ వెను తిరిగాడు. అయితే బాలకృష్ణతో చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి చాలా వరకూ మంచి విజయం అనిపించుకుంది. బట్ ఎన్టీఆర్ బయోపిక్స్ తో బాగా ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. దర్శకుడుగా దమ్మున్నవాడే అయినా కమర్షియల్ విజయాలు అందుకోవడంలో ఎక్కడో తడబడుతున్నాడు క్రిష్. ఆ తడబాటును దూరం చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతానికి ఆగిపోయింది.

ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ మూవీ ఓ పీరియాడిక్ సబ్జెక్ట్. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేస్తూనే నిర్మాతగా కొత్త కుర్రాళ్లను ఎంకరేజ్ చేయబోతున్నాడు క్రిష్. క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ను స్థాపించాడు. ఈ బ్యానర్ పై తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయబోతున్నాడు. ఓ మెగా హీరో లేదా బయటి హీరో ఈ మూవీలో నటిస్తాడని సమాచారం. అలాగే అల్లు అరవింద్ ఆహా ప్లాట్ ఫామ్ లో కూడా వెబ్ సిరీస్ లు నిర్మించబోతున్నాడు. ఈ సిరీస్ లకు హరీష్ శంకర్ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. అలాగే లేటెస్ట్ గా కృష్ణ అండ్ హిజ్ లీల అనే సినిమాతో ఆకట్టుకున్న కుర్ర దర్శకుడు రవికాంత్ పేరేపుతో లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ డిక్లేర్ చేశాడని చెబుతున్నారు . రవికాంత్ ఆల్రెడీ క్షణం సినిమాతో ప్రూవ్ చేసుకుని ద్వితీయ విఘ్నం కూడా దాటేశాడు. సో ఒక వైపు దర్శకత్వం చేస్తూనే నిర్మాతగానూ చాలా ఫోకస్డ్ గా ఉంటున్నాడు క్రిష్. మామూలుగా మన ఇండస్ట్రీలో ఇలా ఇప్పటికే సుకుమార్ వంటి దర్శకులు నిర్మాణం మొదలుపెట్టి శిష్యులను ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ క్రిష్ మాత్రం మంచి కథలు తెచ్చిన దర్శకులను ఎంకరేజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఏదేమైనా నిర్మాతగా పక్కన బెడితే దర్శకుడుగా మాత్రం క్రిష్ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ లో ఉన్నాడనే చెప్పాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here