నాగబాబుపై మండిపడుతోన్న క్రిష్

245
krish sacrifise
krish sacrifise

krish fired on nagababu

అభిమాన హీరోలు ఏం సినిమాలు చేస్తున్నారు.. అవి ఎలా ఉండబోతున్నాయి.. టైటిల్ ఏంటీ.. కథ ఎలా ఉంటుంది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలే అభిమానుల్లో నిరంతరం కలుగుతుండటం చాలా సహజం. ఒక రకంగా ఇవి తెలుసుకోవాలన్న ఆతృత కూడా ఉంటుంది. వారి ఆతృతకు తగ్గట్టుగానే అట్టహాసంగా అనౌన్స్ చేస్తారు మేకర్స్. కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండానే వపన్ కళ్యాణ్ సినిమా మేటర్ అంతా చెప్పి దర్శకుడి కోపానికి కారణమయ్యాడు..   పవన్  బ్రదర్ నాగబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నడూ లేనంత వేగంగా దూసుకుపోతున్నాడు. అతి తక్కువ టైమ్ లోనే పింక్ రీమేక్ వకీల్ సాబ్ ను పూర్తి చేశాడు. కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఈ సినిమా వచ్చే నెలలో విడుదలయ్యేది. మరోవైపు క్రిష్ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. వీటిలో క్రిష్ మూవీ ఆల్రెడీ మొదలైంది కూడా.

అయితే  ఈ సినిమా గురించి ముందు నుంచీ రకరకాల వార్తలు వచ్చాయి. అవన్ని నిజమా కాదా అని అభిమానులు ఎదురు చూస్తోన్న టైమ్ లో నాగబాబు ఆ సినిమా గురించిన ప్రధానమై విషయాన్ని చెప్పి దర్శకుడికి కోపం తెప్పించాడు. లాక్ డౌన్ పీరియడ్ లో నాగబాబు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ప్రధానమైన లీకులూ ఇచ్చేశాడు. ఇక అంతా అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా టైటిల్ విరూపాక్ష అని తేల్చాడు. అలాగే ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా బందిపోటు పాత్రలో నటిస్తున్నాడని చెప్పాడు. దీంతో పాటు అత్యంత కీలకమైన మరో విషయం కూడా చెప్పాడు. ఇది సోషల్ డ్రామా కాదు. పీరియాడిక్ మూవీ. పైగా ఔరంగజేబు కాలంలో సాగే కథట. అంటే హిస్టారికల్ ఫిక్షన్ అన్నమాట. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఆ కాలం నాటి గెటప్ లో కనిపిస్తాడన్నమాట. మొత్తంగా నాగబాబు చేసిన లీకులతో దర్శకుడు క్రిష్ అతనిపై గుస్సాగా ఉన్నాడని టాక్.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here