కంగ‌నాపై క్రిష్ ఫైర్‌

Krish Fires on Kangana

కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ`. జ‌న‌వ‌రి 26న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది. ఈ సినిమాకు ఇద్ద‌రు డైరెక్ట‌ర్స్‌. అందులో తొలి పేరు కంగానా ర‌నౌత్‌.. అయితే మ‌రో పేరు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌. తానే సినిమాను 70 శాతానికి పైగా చిత్రీక‌రించాన‌ని అందుకే త‌న పేరు ముందు వేసుకున్నాన‌ని కంగనా చెప్ప‌డంపై క్రిష్ ఫైర్ అయ్యాడు. తాను గ‌త ఏడాది జూన్ కంతా కంగనా డ‌బ్బింగ్ మిన‌హా మిగ‌తాదంతా పూర్తి చేశాన‌ని.. అప్పుడు సినిమా చూసి బావుంద‌ని చెప్పిన కంగ‌నా త‌ర్వాత మార్పులు చేయాల‌ని చెప్పింద‌ని… అందుకు త‌గ్గ‌ట్టు ఆరు రోజులు రీషూట్ చేశాం. నేను షూట్ చేసిన కొన్ని సీన్స్‌కు క్లోజ‌ప్స్ షూట్ చేసి తానే 70 శాతం షూట్ చేశాన‌ని చెప్ప‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. అందుకు ఆమె అర్హురాలు కాద‌ని ఆయ‌న త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఈ సినిమా మూడు రోజుల్లో 42.50 కోట్ల రూపాయ‌ల‌ను రాబట్టింది.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article