క్రిష్ కరోనాకు ఎదురెళుతున్నాడా..?

23
krish movie update
krish movie update

krish movie update

కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. కానీ ఎన్టీఆర్ బయోపిక్ తో అతని ప్రతిభ కాస్త మసకమారిందనే కమెంట్స్ కూడా ఉన్నాయి. అంతకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి వంటి విజువల్ గ్రాండీయర్ ఉన్న సినిమాను అత్యంత తక్కువ టైమ్ లో పూర్తి చేసిన క్రిష్.. ఆ తర్వాత చేసిన ఎన్టీఆర్ మూవీస్ ఫ్లాప్ గా నిలిచాయి. మరోవైపు బాలీవుడ్ లో కంగనా రనౌత్ తో జరిగిన గొడవతో పాటు పర్సనల్ లైఫ్ లో పెళ్లి బంధం తెగిపోవడం వంటివన్నీ కాస్త ఇబ్బంది పెట్టాయి. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేసి లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే ప్రస్తుతం కరోనా వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. సెట్స్ పైకి వెళ్లడానికి కూడా ఇంకా చాలా టైమ్ ఉంది. మిగతా దర్శకులంతా తమ కథలను మరింత మెరుగు పరుచుకుంటుంటే క్రిష్ మాత్రం అనూహ్యంగా మరో కొత్త సినిమా ప్రకటించాడు. చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా ప్రారంభించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి నిర్మాత కూడా తనే. అయితే ఇంతకంటే ఆశ్చర్యం ఏంటంటే.. ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది. అంటే మూడు రోజుల క్రితమే ఓపెనింగ్ జరుపుకున్నా.. ఆ తర్వాత వెంటనే షూటింగ్ కూడా మొదలైంది.

ప్రస్తుతం వికారా బాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నాడు క్రిష్. ఈ పార్ట్ లో కేవలం హీరో మాత్రమే ఉన్నాడు. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మరికొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా షూట్ చేయబోతున్నారు. అయితే కరోనా వల్ల చాలామంది షూటింగ్స్ అంటే భయపడుతున్నారు. కానీ క్రిష్ మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకుని ఏకంగా షూటింగే మొదలుపెట్టడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు కొత్త కుర్రాడు వైష్ణవ్ సైతం ఈ కరోనాకు భయపటడం లేదు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో చిరంజీవి చిన్న కూతురు భర్త కళ్యాణ్ దేవ్ కూడా కరోనా టైమ్ లో తన సూపర్ మచ్చి సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు మేనల్డుడు. క్రిష్ మాత్రం ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేసి ఆ వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. అంటే ఎలా చూసినా .. థియేటర్స్ లో అయినా లేదంటే ఓటిటిలో అయినా.. క్రిష్ – వైష్ణవ్ ల సినిమా మరో మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందనుకోవచ్చు.

tollywood news

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here