క్షణక్షణం ప్రేక్షకులకు భారమైందా?

KSHANA KSHANAM REVIEW

ఉదయ్ శంకర్, జియా శర్మలు నటించిన చిత్రం “క్షణ క్షణం” విడుదలైంది. కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో మన మూవీస్ బ్యానర్‌లో డాక్టర్ వర్లు ఈ చిత్రం నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్స్’ ద్వారా ఈ సినిమాను విడుదల చేయడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

కథ:

కథలోకి వెళితే.. సత్య (ఉదయ్ శంకర్) ఓ అనాధ. ప్రీతి (జియా శర్మ) అనే మరో అనాధను వివాహం చేసుకుని సాధారణ జీవితం గడుపుతుంటాడు. ప్రీతి కాస్త మనీ మైండెడ్ అమ్మాయి. సత్య తెస్తున్న సంపాదన పట్ల ఆమె సంతోషంగా ఉండదు. దీంతో,  ఒకరికొకరు విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తారు. సత్య తన ఫిషింగ్ వ్యాపారంలో భారీగా నష్టపోతాడు. అతను చేసిన అప్పులు పెరిగి మీదపడుతుండంతో వాటి నుంచి బయటపడేందుకు అతను డేటింగ్ యాప్ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రక్రియలో అతనికి మాయ (శ్రుతి సింగ్) అనే ఓ వివాహితతో స్నేహం ఏర్పడుతుంది. సత్యపై మోహంతో ఓ రాత్రి ఆమె అతడిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. కాకపోతే, ఆ రాత్రి మాయ ఇంటికి వచ్చిన సత్యకు మాయ చనిపోయి కనిపిస్తుంది. అతను పోలీసులకు సమాచారమిస్తాడు. అక్కడకొచ్చిన ఎస్ఐ కృష్ణ మనోహర్ (రవి ప్రకాష్) సత్యను అనుమానించి దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ నేపధ్యంలో సత్య జైలు శిక్ష అనుభవిస్తారా లేదా కేసు నుండి బయటకొస్తారా? అతని వివాహం మనుగడ సాగిస్తుందా లేదా విడాకులతో ముగుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

“క్షణ క్షణం” చిత్రం ప్రేక్షకుల్ని సినిమాలో నిమగ్నం చేయడంలో విఫలమయ్యిందనే చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ మినహా, మిగతా చిత్రం కొత్తగా, ఆకట్టుకునేలా అనిపించలేదు. అయితే సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా, యువ బృందాన్ని ప్రోత్సహించడానికి, సాధారణ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు చూడొచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article