ఉనికి కోసమే కాంగ్రెస్ నేతల తుమ్మడిహట్టి బోట్ షికార్ అన్న కేటీఆర్ 

KTR COMMENTS ON CONGRESS LEADERS
 హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ కాంగ్రెస్ నేతల తుమ్మడిహట్టి పర్యటనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం పచ్చగా ఉంటే చూసి కాంగ్రెస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఇక మెంబర్ షిప్ డ్రైవ్ ను ఉద్దేశించి కార్యకర్తలు, నేతల సమిష్టి కృషితోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.  .తెలంగాణ ఏర్పడిన ఐదేళ్ల కాలంలోనే కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికి మార్గదర్శిగా నిలబెట్టారని కేటీఆర్ కొనియాడారు. ఐదేళ్ల క్రితం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారని.. కానీ కేవలం ఏడాది కాలంలోనే అందరి సందేహాలను పటాపంచలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఆరు దశాబ్ధాల కరెంట్ కష్టాలను కేసీఆర్ ఏడాదిలోనే పొగొట్టారని తెలిపారు. గణేశ్ నవరాత్రులు వచ్చాయంటే ఖచ్చితంగా రెండు, మూడు రోజులు కర్ఫ్యూ వుండేదని కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్ధితి లేదన్నారు.కరెంట్, సాగు, తాగు నీటీ సమస్యలను తొలగించి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ అభివృద్ధి ప్రణాళికలను కాంగ్రెస్ నేతలు చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.ప్రాణహిత నదిలో బోటు షికారు చేసి.. కేసీఆర్‌పై విమర్శలు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అపసోపాలు పడుతున్నారని సెటైర్లు వేశారు. ప్రజలు ఎన్నికలలో బుద్ది చెప్పినా కాంగ్రెస్ నేతలు మారటం లేదని… తెలంగాణ లో నే కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీ లలో చేరుతున్నారని కేటీఆర్ విమర్శించారు.ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు టి ఆర్ ఎస్ పార్టీ పటిష్టం గా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలను సంతృప్తి పరిచి రుణం తీర్చుకుంటామని కేటీఆర్ తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ నేతల తుమ్మడిహట్టి పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కాంగ్రెస్ కు తెలంగాణలో కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.
KTR LATEST COMMENTS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article