అక్కడ మాత్రమే నా ప్రచారం…

148
KTR Compaign Two Places In Municipal Elections
KTR Compaign Two Places In Municipal Elections

KTR Compaign Two Places In Municipal Elections

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల వేళా అయింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ తమదైన శైలిలో ముందుకెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస ముందు వరుసలో ఉండగా కాంగ్రెస్ పోటీ కూడా ఇచ్చే పరిస్థితిల్లో లేదు. ఇక మున్సిపల్ పోల్ కి బీజేపీ సన్నధం అవుతుంది. తాము కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నామంటూ చాటింపేస్తుంది. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార సాధనలపై మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన కేవలం సిరిసిల్ల, వేములవాడలో తప్ప, నా ప్రచారం బయటి ప్రాంతాల్లో ఉండదన్నారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో రోడ్‌ షోలు, భారీ బహిరంగ సభలు ఉండవు ఉండవని చెప్పారు. ఆర్భాటం, అట్టహాసం లేకుండా చాలా ప్రశాంతంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు కేటీఆర్. ఇక సిరిసిల్ల, వేములవాడలో తప్ప ఇంకెక్కడా కూడా ప్రచారం చెయ్యనని, ఈ ఎన్నికల్లో వంద శాతం విశ్వాసం ఉందన్నారు.

KTR Compaign Two Places In Municipal Elections,Telangana Municipal Elections 2020,Sircilla,Vemulawada,TRS,BJP,Congress,#KTR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here