KTR confident On Municipal Elections 2020
తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎవరికీ వారు తమ సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నారు. తెలంగాణాలో అధికార పక్షం తెరాస, తెలంగాణ కాంగ్రెస్ పోటీ పడుతుండగా, బీజేపీ సైతం ఒంటరి పోరుకు సిద్ధమౌతోంది. ఇక తెలంగాణాలో మాదే పైచేయి అంటుంది తెరాస పార్టీ. ఈ సమయంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కల్వకుంట తారకరామారావు. అయన మాట్లాడుతూ.. తెలంగాణాలో ప్రజలు తెరాస పార్టీకే విజయం అందివ్వనున్నారు. తెరాస ప్రభుత్వంపై వ్యతికరేకత లేదని తేల్చేసిన కేటీఆర్, కేసీఆర్ నాయకత్వాన్ని ఈ ఎన్నికల్లోనూ దీవిస్తారు అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తెరాస కు ఓటెయ్యకుండా ఉండటానికి కారణాలు కూడా లేవన్నారు కేటీఆర్. అయితే తెరాస పార్టీకి కాదని వేరే పార్టీలకు ఓటేసినా… పెద్దగా ప్రయోజనం ఉండబోదంటూ స్పష్టం చేశారు మంత్రి. అదేవిధంగా ప్రతిపక్షాలపై మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది అన్నారు. ఇక బీజేపీ నాయకులను ప్రజలు నమ్మరు అన్నారు.ఇక ఎంఐఎం పార్టీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు మంత్రి కేటీఆర్. మజ్లిస్‌పై మా వైఖరి ఎంటో దేశం మొత్తానికి తెలుసన్నారు.