ఉపాసన చేసిన కొత్త ఉద్యోగానికి కేటీఆర్ కృతజ్ఞతలు

KTR Congratulations to Upasana  For New Job

కేటీఆర్‌ సర్.. నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది… అంటూ తన కొత్త ఉద్యోగం పై ట్వీట్ చేశారు రామ్ చరణ్ భార్య ఉపాసన. ఇక దాంతో కేటీఆర్‌ స్పందిస్తూ మా బృందానికి సహకరించినందుకు ధన్యవాదాలు అంటూ రీట్వీట్ చేశారు. ఇంతకీ ఉపాసన చేసిన కొత్త ఉద్యోగం ఏంటి? కేసీఆర్ ఉపాసన ఎందుకు అభినందించారు..? కొంపదీసి ఉపాసన కూడా రాజకీయాల్లోకి రానున్నారా? ఈ వార్త చదివితే ఇలాంటి అనుమానాలు బోలెడన్ని వస్తాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే
..మాజీ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ‘మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.. కాగా అంతకుముందే వరల్డ్ ఎనకమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఉపాసన వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆమె అక్కడ ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ఆకర్షించేందుకు తనవంతు కృషి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలు ఇన్వెస్టర్లకు క్లియర్ గా చెప్పారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఉపాసన వెల్లడించారు. కేటీఆర్ సర్ ”నేను కొత్త ఉద్యోగంలో చేరారు. నా జాబ్ ఎలా ఉంది” అని ట్వీట్‌లో పేర్కొంది. దీంతో ఉపాసనకు కృతజ్ఞతలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article