ఢిల్లీలో చక్రం కాదు.. విజయవాడలో బొంగరం కూడా తిప్పలేరు

KTR FIRED AGAIN ON CBN

  • ఇక రాజకీయాలకు చంద్రబాబు రాంరాం చెప్పాల్సిందే
  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు
  • ఐటీ గ్రిడ్స్ కేసులో నేరం రుజువైతే మొదటి ముద్దాయి ఏపీ సర్కారేనని వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కుంభకోణంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లో కేసు నమోదు కావడం.. దీంతో తెలుగుదేశం అధినే చంద్రబాబు తీవ్రంగా స్పందించి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడం.. వీటిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇవ్వడం వంటి పరిణామాలతో ఇది హాట్ టాపిక్ గా మారింది. తనతో పెట్టుకుంటే మూలాలు కదిలిస్తానంటూ చంద్రబాబు మళ్లీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ మరోమారు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రజలు చంద్రబాబుపై చాలా వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. ఈసారి రాజకీయాలకు చంద్రబాబు రాంరాం చెప్పాల్సిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పాలని కలలు కంటున్నారని.. కానీ ఢిల్లో చక్రం కాదు కదా.. విజయవాడలో బొంగరం కూడా తిప్పలేరని సెటైర్ వేశారు.

తెలంగాణలో తమను ఓడించేందుకు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులందరినీ ఆయన ఏకం చేశారని.. కానీ తాము అభివృద్ధి చేశాం కాబట్టే తమను ప్రజలు ఓట్లేసి గెలిపించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక డేటా చోరీ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుకి అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తుల మీద దాడి జరిగితే ఎందుకు భయపడుతున్నారు? ఐటీ గ్రిడ్ మీద దాడి జరిగితే ఏపీ ఐటీ మీద దాడి జరిగినట్లు సృష్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో నేరం రుజువు అయితే మొదటి ముద్దాయి ఏపీ ప్రభుత్వమే అవుతుందని కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న వాళ్లను తాము బెదిరిస్తున్నామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ… హైదరాబాద్ లో పెద్ద ఆస్తి ఉన్న వ్యక్తి చంద్రబాబేనన్నారు. మహా నాయకుడు సినిమా ప్రజలే చూడటం లేదు… కానీ చంద్రబాబు మాత్రం ఏకంగా ప్రధాని మోదీని ఆ సినిమా చూడమన్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article